Helping Nature
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి తోపుడు బండిపై బట్టలు అమ్ముకొంటు న్నట్లుగా వుందికదా కానీ కాదు ఆయన పేరు పంతంగి జ్యోతియ్య గతంలో ex army sbi లో security guardగా retair అయిన రోజు నుండి తన ఊరికి సేవ చేయాలని తలంచి ఇద్దరు మిత్రులతో కలిసి మొదటగా అద్దంకి లోని స్మశానవాటికలను అన్ని సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు అంతటితో ఆగకుండా మరణించిన వారి బంధువులతో మాట్లాడి వారిని నేత్ర దానాలు చేసేవిధంగా ప్రోత్సహించే వారు అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంతటితో ఆగక ఇంటింటికి తిరిగి పాతవస్తువులు,బట్టలు సేకరించి అవి లేని పేదలకు పంచుతూ ఎవరి ఇంట నైనా కార్యక్రమాలలో భోజనాల సమయంలో మిగిలిన ఆహార పదార్థాలు సేకరించి పేదలకు అందిస్తుంటారు, రిటైర్మెంట్ తరువాత హాయిగా పెన్షన్ డబ్బులతో కాలం గడపకుడా ప్రజలకు ,సమాజానికి ఎంతో ఉపయోగ కరమైన పనులు చేస్తున్న పంతంగి జ్యోతియ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాము.